
మహాకవి మరణించలేదు - నాహృదిలో ఉదయించినాడు కూలివాని గుండెలొ ఆవేదన ఉందని కార్మికుని కడుపులో ఆకలి రగిలందని కలంపట్టి వ్రాసిన మాకవి మహాకవి శ్రీ శ్రీ మహాకవి మరణించలేదు - నాహృదిలో ఉదయించినాడు దోపిడిదారుల దురంతాలు సాగవని పీడకుల పాలన మాకిక వద్దని గళం ఎత్తిపాడిన మాకవి మహాకవి శ్రీ శ్రీ మహాకవి మరణించలేదు - నాహృదిలో ఉదయించినాడు దగాపడ్డ తమ్ములార ఏకంకండని మోసపోక యికనైనా మేలుకొండని మాకు పిలుపునిచ్చిన మాకవి మహాకవి శ్రీ శ్రీ మహాకవి మరణించలేదు - నాహృదిలో ఉదయించినాడు

0 / 500
No comments yet!
Be the first one to show your love for this song