Song Cover Image

*"సమస్తము నీదే దేవా"* _Raga: Mohanam | Talam: Adi_

*పల్లవి* లోకముది కాదేది ఇలలో నాది సమస్తము నిచ్చు దేవునిదే అంతా! నీవిచ్చిన ఊపిరి నీదే దేవా నీ పాదములకే నా హృదయ అర్పితము ప్రభువా //2// *అనుపల్లవి* ఇల్లు వాకిలి భూమి బంగారం అన్నీ నీ అనుగ్రహమే ప్రభువా! నేను నిమిత్తమాత్రుడిని దేవా నడిపించే దారి నీదే కదా//2// *చరణం 1* పొలము పంట పశువు సంపద పేరు ప్రతిష్ట అంతా నీదే ప్రభువా! కష్టములో ఆదుకున్నది సుఖములో నీడైనది నీవే దేవా! కృతజ్ఞతతో శిరసువంచి కీర్తించెదను నిన్నే సదా//2// *చరణం 2* పుట్టుక నీ చేతిలో గిట్టుక నీ చేతిలో మధ్యలో ఈ బ్రతుకు నీకు సమర్పితము అహంకారము విడిచి అర్పణమైతిని సర్వము నీదే అంటూ//2// *చరణం 3* గిరులలోని చెట్లు చేమలు సముద్రము నదులు నీరన్నీ అన్నియు నీ సృష్టి నీ మహిమ కొలిచెదను నిత్యము //2// లోకముది కాదేది ఇలలో నాది సమస్తము నీదే పరమతండ్రీ ప్రభువా //2// *చివరి పల్లవి* లోకముది కాదేది ఇలలో నాది, veena సమస్తము నిచ్చు దేవునిదే నీ పాద సన్నిధి చాలు ప్రభువా ఇంకేమి వద్దు నాకు దేవా!