
(పల్లవి) కృష్ణా గోదారి కలయిక నువ్వూ రెండు రాష్ట్రాల గుండెవు నువ్వూ తెలంగాణా తుడుం నువ్వూ నగ్జల్భరి గర్జన నువ్వూ పాటా మాటల తూటావి నువ్వూ... కానూరి తాతా... అక్షరాల దివిటీవి నువ్వూ.. కానూరి తాతా.. (చరణం 1) ప్రజానాట్య మండలిలోన పరిమళించిన కవితవు నువ్వూ తెలంగాణా సాయుధ పోరు పాటై సాగిన కొరియర్ నువ్వూ వరంగల్లు దళం తోడూ కవాతుగ నడిచిన తంబుర నువ్వూ అరుణోదయకు అడుగులు నేర్పి తీర్చిదిద్దిన గురువువి నువ్వూ నిండు నూరేళ్ళ చరితవు నువ్వూ.. కానూరి తాతా.. ప్రజా కళల భవితవు నువ్వూ.. కానూరి తాతా.. (చరణం 2) రామనరసయ్య బుర్రకథ నువ్వూ భూమి బాగోతం చిందులు నువ్వూ సింగరేణి బొగ్గు కథ నువ్వూ శ్రీకాకుళము చింతవు నువ్వూ నెల్లిమర్ల వంతవు నువ్వూ గుంటూరు మిర్చీ ఘాటువు నువ్వూ గోదావరి లోయ గలగల నువ్వూ ఓరుగల్లు ధైర్యం నువ్వూ ఖమ్మం మెట్టూ పట్టువి నువ్వూ ఇల్లందు విల్లంబు నువ్వూ.. ఉద్యమాల గొంతుక నువ్వూ .. కానూరి తాతా.. విప్లవాల గీతిక నువ్వూ .. కానూరి తాతా..

