గొంతులోన వసంత మేఘం పాడిందా.. ఉద్యమాల గీతమయ్యి సాగిందా.. గుండె లోన గోదారి లోయ ఆడిందా.. జానపదమే నిన్ను వీరుని చేసిందా.. **నాగన్నా.. నాగన్నా.. జోహార్లు నాగన్నా.. నాగన్నా.. నాగన్నా.. జోహార్లు నాగన్నా.. ** సొంత ఊరు సోపతేదో చేసిందా.. సద్ది మూట కట్టి నిన్ను పంపిందా.. శ్రీహరన్న త్యాగమే నిను మార్చిందా.. చిత్రహింస మొండితనమే నేర్పిందా.. కంజరే నీ చేతి ఆయుధమయ్యిందా.. అరుణోదయమై కొత్త వెలుగు పంచిందా.. **నాగన్నా.. నాగన్నా.. జోహార్లు నాగన్నా.. నాగన్నా.. నాగన్నా.. జోహార్లు నాగన్నా.. ** పల్లే పల్లే కూడగట్టి సోయి నేర్పిన మాటలెన్నో పలుకు పలుకు కూడబల్కి అల్లుకున్న పాటలెన్నో.. జులుం పైన జబ్బ చరిచి నడిచి వచ్చిన బాటలెన్నో.. మూగబోయిన గొంతు లోన దాచుకున్న బాధలెన్నో.. **నాగన్నా.. నాగన్నా.. జోహార్లు నాగన్నా.. నాగన్నా.. నాగన్నా.. జోహార్లు నాగన్నా.. **


