
గందము వూసేవేలే కమ్మని మేన యీగందము నీమేనితావికంటె నెక్కుడా **గందము వూసేవేలే కమ్మని మేన యీగందము నీమేనితావికంటె నెక్కుడా** అద్దము చూచేవేలే అప్పటపట్టికిని అద్దము నీ మోముకంటె నపురూపమా ఒద్దిక తామరవిరినొత్తేవు కన్నులు నీ గద్దరికన్నులకంటె కమలము ఘనమా ఒద్దిక తామరవిరినొత్తేవు కన్నులు నీ గద్దరికన్నులకంటె కమలము ఘనమా **గందము వూసేవేలే కమ్మని మేన యీగందము నీమేనితావికంటె నెక్కుడా** బంగారు వెట్టేవేలే పడఁతి నీ మెయినిండా బంగారు నీతనుకాంతి ప్రతివచ్చీనా ఉంగరాలేఁటికినే వొడికిపువేళ్ళ వెంగలిమణులు నీ వేలిగోరఁబోలునా **గందము వూసేవేలే కమ్మని మేన యీగందము నీమేనితావికంటె నెక్కుడా** సవర మేఁటికినే జడియు నీ నెరులకు సవరము నీకొప్పుసరి వచ్చీనా యివలఁ జవుల నీకునేలే వెంకటపతి - సవరని కెమ్మో విచవికంటేనా **గందము వూసేవేలే కమ్మని మేన యీగందము నీమేనితావికంటె నెక్కుడా** **గందము వూసేవేలే కమ్మని మేన యీగందము నీమేనితావికంటె నెక్కుడా** **గందము వూసేవేలే కమ్మని మేన యీగందము నీమేనితావికంటె నెక్కుడా**

