Song Cover Image

శివశివ శివశివ యనరాదా…Hamsanandi

Sa… Ri… Ga… | Pa… Ni Sa… Ni Pa… Ga Ri… | Sa… శివశివ శివశివ యనరాదా… శివశివ శివశివ యనరాదా…మనసా… శివ నామ స్మరణము సేయరాదా… సంకీర్తన సుధలొలికించరాదా… హరహర హరహర యనరాదా… మనసా హరుని కీర్తనలాలపించరాదా… ధ్యానమగ్నులై తపించగరాదా… Sa Ri Ga Pa | Ni Sa Ni Pa Ga Ri Sa Ri | Pa Ni Sa… శివశివ శివశివ యనరాదా… శివశివ శివశివ యనరాదా…మనసా… హిమగిరిపై తాను కొలువుండెనే స్వామి ఉమా సహితుడై పద నర్తనమాడెనే Sa Ri Ga | Pa Ni Sa Ni Pa Ga | Ri Sa Sa Ri Ga Pa | Ni Sa Ni Pa Ga Ri Sa Ri | Pa Ni Sa Sa Ri Ga | Ri Ga Pa Pa Ni | Pa Ni Sa తాండవ నృత్యం జగతికి కళ్యాణం కళ్యాణ కారకుని కొలువగ రారే Tha Dhi Gi Na Thom Tha Ka Tha Ri Ki Ta Thom Dhi Mi Dhi Mi | Thom… Tha Dhi Thom | Nam Tha Ki Ta Dhi Mi Tha Ka | Thom… Tha Dhi Gi Na Thom Tha Ka Tha Ri Ki Ta Thom Dhi Mi Dhi Mi | Thom… పావన చరితుడు గంగాధరుడనీ భోళాశంకరుని భజియించగ రారే శివశివ శివశివ యనరాదా… శివశివ శివశివ యనరాదా…మనసా… ప్రమథ గణములు పరమేశుని ప్రస్తుతించెనే పార్వతీ పతికి శిరమొంచి ప్రణమిల్లవే ప్రకటమాయెను పరమాత్ముడు తానే లింగ రూపమున లీలను జూపెడు వేళాయె జాగరణముతో జప తపములతో అభిషేకించి కాంచిన పరమ పుణ్యమే Ni Pa Ga | Ri Sa Sa Ri Ga Pa Ni Sa Sa Ni Pa Ga Ri Sa Ri Ga Pa Ni Sa || Sa… Tha… Thom… | Tha Dhi Thom Nam… Tha… | Ki Ta Thom శివశివ శివశివ యనరాదా… శివశివ శివశివ యనరాదా…మనసా… పాపుల చింతలు తీర్చగ తరలి వచ్చెనే భస్మధారియై భక్తులకు భవ్యత నొసగెనే గజముఖ, షణ్ముఖ సుతులతో గూడెనే అజ్ఞాన తిమిరమును పారద్రోలునే వీరభద్రుని ఆదేశించీ అధర్మమునణచెనే దానవత్వమును ఇలలో రూపుమాపునే Ni Sa Ri… | Ga Pa Ni Sa Sa Ni Pa… | Ga Ri Sa || శివశివ శివశివ యనరాదా… శివశివ శివశివ యనరాదా…మనసా…